హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర.. భారీ భద్రత మధ్య నిమజ్జనంHyderabad lo Khairatabad Mahaganapathi Shobhayatra.. bhari bhadratha madhya Nimjanam
హైదరాబాద్‌లో 69 అడుగుల ఖైరతాబాద్ గణేశుడిని భారీ భద్రత మధ్య నిమజ్జనం చేస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.Hyderabad lo 69 adugula Khairatabad Ganesudni bhari bhadratha madhya Nimjanam chestunnaru. Bhari sankhyalo bhaktulu taralivacharu.
హైదరాబాద్ నగరంలో ప్రసిద్ధి చెందిన 69 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర ప్రారంభమైంది. సాంకేతిక కారణాల వల్ల ఉదయం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన ఊరేగింపు కొంత ఆలస్యమైంది. విజయవాడ నుండి తీసుకొచ్చిన భారీ టస్కర్ వాహనంపై గణనాథుడిని సురక్షితంగా తరలిస్తున్నారు.
ఖైరతాబాద్ నుండి ప్రారంభమైన ఈ ఊరేగింపు సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్ మార్గాల ద్వారా ఎన్టీఆర్ మార్గం వైపు సాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల లోపు నిమజ్జనాన్ని పూర్తి చేయాలని ఉత్సవ కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది. డీజేలకు అనుమతి లేకపోవడంతో సన్నాయి మేళాల మధ్య భక్తులు గణపతిని ఆరాధిస్తున్నారు.
నిమజ్జనం ఏర్పాట్ల కోసం భారీ భద్రతా చర్యలు చేపట్టారు. రాజధాని శివారు ప్రాంతాల నుండి హుస్సేన్‌సాగర్ వరకు సుమారు 45 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో సుమారు వెయ్యి మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.
భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసు యంత్రాంగం ట్రాఫిక్‌ను నియంత్రించింది. ట్యాంక్‌బండ్, హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో భక్తుల సందడి నెలకొంది. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్, సచివాలయం పరిసరాల్లో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
Hyderabad nagaramlo prasiddhi chendina 69 adugula Khairatabad Mahaganapathi Shobhayatra prarambhamaindi. Sankethika karanala valla udayam 6 gantulaku prarambham kavalsina uregimpu kontha alasyamaindi. Vijayawada nundi tisukochina bhari tusker vahanam pai Gananathudni surakshitanga tarlistunnaru.
Khairatabad nundi prarambhamaina ee uregimpu Sensation Theater, Rajduth Chaurasta, Telephone Bhavan, Iqbal Minar margala dwara NTR margam vaipu sagutondi. Madhyahnam 2 gantala lobu Nimjannanni purti cheyalani utsava committee lakshyamga pettukundi. DJ-laku anumati lekapovadamto sannayi melala madhya bhaktulu Ganapatini aradhistunnaru.
Nimjanam erpatla kosam bhari bhadratha charyalu cheppataru. Rajadhani shivaru pranthala nundi Hussain Sagar varaku sumaru 45 vela mandi polisulato bandobustu erpa chesaru. Hussain Sagar parisarallo sumaru veyyi mandi polisulu vidhulu nirvahistunnaru.
Bhaktula raddi drustya police yantrangam traffic nu niyantrinchindi. Tank Bund, Hussain Sagar parisarallo bhaktula sandadi nelakondi. Telangana Thalli flyover, Sachivalayam parisarallo bhari sankhyalo bhaktulu taralivacharu.
ఈ వార్తలో తప్పు ఉందా? నివేదించండిEe varthalo tappu undaa? Nivedinchandi