తూప్రాన్‌లో మావోయిస్టు హెచ్చరికల కరపత్రాలు: ఇద్దరు అరెస్ట్Tupran lo Maoist hecharkala karapatralu: iddaru arrest
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో మావోయిస్టు పేరుతో హెచ్చరికలు రాసిన కరపత్రాలను పోలీసులు స్వాధీకారు. సోషల్ మీడియా కోసం మావోయిస్టు పేరు వాడుకున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.Medak jilla Tupran pattanamlo Maoist peru tho hecharkalu rasina karpatralanu police swadhikararu. Social media kosam Maoist peru vadukkonna iddaru vyaktitlanu arrest chesaru.
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో పోలీస్ స్టేషన్, మున్సిపల్ కార్యాలయం వద్ద ఎర్రబట్టపై మావోయిస్టు హెచ్చరికలు రాసిన కరపత్రాలను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి తూప్రాన్ మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
గత సెప్టెంబర్ 16న మేడారం సమ్మక్క-సారక్క దేవాలయంలో జరిగిన ఒక కార్యక్రమం నేపథ్యంలో ఈ కరపత్రాలను పంపిణీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ నుంచి స్పందన రాకపోవడంతో, తూప్రాన్ కార్యాలయాల వద్ద ఈ హెచ్చరికలను ప్రదర్శించినట్లు సమాచారం.
నిందితులను విచారించగా, సోషల్ మీడియాలో ప్రాచుర్యం కోసం, వ్యూస్ ద్వారా డబ్బు సంపాదించే ఉద్దేశంతో మావోయిస్టు పేరును వాడుకున్నట్లు తేలింది. తూప్రాన్ మండలం నాగులపల్లికి చెందిన మధు, చింతకింది శ్రీధర్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ కుట్రలో పాల్గొన్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.
పోలీసులు ఈ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో తూప్రాన్ డిఎస్పి నరేంద్ర గౌడ్, ఎస్సై గంగరాజు ఇతర అధికారులు పాల్గొని విచారణ చేపట్టారు.
Medak jilla Tupran pattanamlo police station, municipal karyalayam vadda errabattapai Maoist hecharkalu rasina karpatralanu police gurtincharu. Ee ghatnapai vicharana chepatti Tupran mandalaniki chendina iddaru vyaktitlanu police arrest chesaru.
Gatha September 16na Medaram Sammakka-Sarakka devalayamlo jarigina oka karyakramam prashangamlo ee karpatralanu pampini chesinatlu adhikarulu gurtincharu. Prabhutvam nunchi spandana rakovadamto, Tupran karyalayala vadda ee hecharkalanu pradarshinchinatlu samacharam.
Nindititlanu vicharinchaga, social media lo prachuryam kosam, views dwara dabbu sampadinche uddeshamto Maoist perunnu vadukkunnatlu telindi. Tupran mandalam Nagulapalliki chendina Madhu, Chintakindi Sridhar ane iddaru vyaktitlu ee kutralo palgonnatlu SP Srinivasarao vellidincharu.
Police ee iddaru nindititlanu arrest chesi Shukravaram court lo hajaruparicharu. Ee kesulo Tupran DSP Narendra Goud, SSI Gangaraju itara adhikarulu palgoni vicharana cheppattaru.
ఈ వార్తలో తప్పు ఉందా? నివేదించండిEe varthalo tappu undaa? Nivedinchandi