హాస్టళ్లలో ఎలుకల భయం.. గాయాలపాలైన విద్యార్థులుHostallalo eluka bhayam.. gayalapalaina vidyarthulu
తెలంగాణలోని ప్రభుత్వ హాస్టళ్లలో ఎలుకలు విద్యార్థులను తీవ్రంగా గాయపరుస్తున్నాయి. పాలకుర్తి, కాకతీయ యూనివర్సిటీల్లో వరుస ఘటనలు అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నాయి.Telangana lo prabhutva hostallalo elukalu vidyarthulanu teevranga gayaparustunnayi. Palakurti, Kakatiya University lo varusa ghatanalu adhikarula nirlakshyanni ethichuputunnayi.
తెలంగాణలోని ప్రభుత్వ హాస్టళ్లలో ఎలుకల కారణంగా విద్యార్థులు ప్రాణాలకు ముప్పును ఎదుర్కొంటున్నారు. ఇటీవల జనగామ జిల్లా పాలకుర్తిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఎలుకలు విద్యార్థులను తీవ్రంగా గాయపరిచాయి. రాత్రి సమయంలో గదుల్లోకి ప్రవేశించిన ఎలుకలు నిద్రిస్తున్న విద్యార్థులపై దాడి చేయడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనలో గాయాలైన 14 మంది విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, ఈ విషయం బయటకు రావద్దన్న ఆందోళనతో పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా రహస్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కేవలం పాఠశాలలే కాక, ఉన్నత విద్యా సంస్థల్లో కూడా ఇదే సమస్య ఎదురవుతోంది. కాకతీయ యూనివర్సిటీలోని సమ్మక్క-సారలమ్మ హాస్టల్‌లో కూడా ఎలుకలు 11 మంది విద్యార్థులను గాయపరిచాయి. అక్కడ విద్యార్థులకు ప్రాథమిక చికిత్స అందించేందుకు ఆసుపత్రిలో అవసరమైన మందులు కూడా అందుబాటులో లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది.
గతంలో ఖమ్మం జిల్లాలో ఒక విద్యార్థి ఎలుకల దాడికి గురై ఆసుపత్రిలో చేరడం, నాగర్‌కూర్నూల్ జిల్లాలో ఒక పసిపిల్లను ఎలుకలు కొరకడం వంటి ఘోరమైన ఘటనలు చోటుచేరాయి. ప్రభుత్వ ఆసుపత్రులు, హాస్టళ్లలో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని, విద్యార్థుల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Telangana lo prabhutva hostallalo elukala karanamga vidyarthulu pranalaku muppunu edurkuntunnaru. Ippudu Janagama jilla Palakurti lo Telangana Sanghika Sankshema Balikala Gurukula pathashalalo elukalu vidyarthulanu teevranga gayaparichayi. Ratri samayamlo gadulloki praveshinchina elukalu nidristhunna vidyarthula pai dadi cheyadamtho paluvuru teevranga gayapaddaru.
Ee ghatnalo gayalaina 14 mandi vidyarthulanu sthanika prabhutva asupatriki taralinchi chikitsa andincharu. Ayithe, ee vishayam bayataku ravaddanna andholanatho pathashala yajamanyam thalidandrulaku samacharam ivvakunda rahashyanga vyavaharinchinatla aropanalu velluvetthutunnayi.
Kevalam pathashalale kaka, unnatha vidya samsthallo kuda ide samasya eduravutondi. Kakatiya University lo Sammakka-Saralamma hostel lo kuda elukalu 11 mandi vidyarthulanu gayaparichayi. Akkada vidyarthulaku pradhamika chikitsa andicheduku asupatrilo avasaramaina mandulu kuda andarbatulo lekapovadam adhikarula nirlakshyaniki nidarshanamga marindi.
Gatamlo Khammam jillalo oka vidyarthi elukala dadhiki gurai asupatrilo cheradam, Nagarkurnool jillalo oka pasipillanu elukalu korakadam vanti ghoramaina ghatnalu chotucherayi. Prabhutva asupatrulu, hostallalo parishuddhyam meruparucharali, vidyarthula bhadratha kosam takshana charyalu teesukovali tallidandrulu demand chestunnaru.
ఈ వార్తలో తప్పు ఉందా? నివేదించండిEe varthalo tappu undaa? Nivedinchandi