తెలంగాణలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బ్యూరో ఏర్పాటుTelangana lo traffic samasyala parishkaraniki pratyeka bureau erpaatu
రాష్ట్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం 'TG-TMARS' అనే ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.Rashtramlo perugutunna traffic raddini niyantrinchadaniki, road pramadalanu tagginchendu prabhutvam 'TG-TMARS' ane pratyeka bureau nu erpaatu chestu kelika nirnayam teesukundi.
తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న వాహనాల సంఖ్య దృష్ట్యా ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్లు, రైల్వేల భద్రతను పటిష్టం చేసేందుకు 'తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో' (TG-TMARS)ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ బ్యూరో, రాష్ట్రవ్యాప్తంగా తన అధికార పరిధిని కలిగి ఉంటుంది. దీనికి అదనపు డీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారి డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 32 వేల కిలోమీటర్ల రోడ్ల నెట్‌వర్క్‌లో శాస్త్రీయ పద్ధతిలో ట్రాఫిక్‌ను నిర్వహించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.
ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ, ఎన్‌ఫోర్స్‌మెంట్ పై ఈ బ్యూరో ప్రత్యేక దృష్టి సారిస్తుంది. మోటార్ వెహికల్స్ యాక్ట్-1988 ప్రకారం ట్రాఫిక్ విధుల పర్యవేక్షణతో పాటు, హైవే పెట్రోలింగ్, రోడ్డు ప్రమాదాల దర్యాప్తు వంటి కీలక అంశాలను ఇది నిర్వహిస్తుంది.
రోడ్డు భద్రత కోసం ఎలక్ట్రానిక్ మానిటరింగ్, ఆధునిక అనలిటిక్స్ మరియు ప్రాసిక్యూషన్‌కు ప్రత్యేక వ్యవస్థను ఈ బ్యూరో రూపొందిస్తుంది. కేంద్ర రహదారి రవాణా శాఖ నిర్దేశించిన భద్రతా నియమాలను కచ్చితంగా అమలు చేయడం దీని బాధ్యత. ఈ ప్రత్యేక వ్యవస్థ ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించి, ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడం ప్రభుత్వ లక్ష్యం.
రాష్ట్ర రోడ్డు భద్రతా మండలి పర్యవేక్షణలో ఈ బ్యూరో పనిచేస్తుంది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనరేట్లు, జిల్లాల ట్రాఫిక్ విభాగాల కార్యకలాపాలపై TG-TMARS నిరంతరం పర్యవేక్షణ ఉంచుతుంది.
Telangana rashtramlo perugutunna vahanala sankhya drustya traffic samasyalanu parishkarinchadaniki prabhutvam kelika nirnayam teesukundi. Roadlu, railwayla bhadratanu patishtam cheyenduku 'Telangana Traffic Management, Road and Rail Safety Bureau' (TG-TMARS) nu erpaatu chestu utharvulu jari chesindi.
Hyderabad kendramga karyakalapalu nirvahinche ee bureau, rashtravyaptamga tana adhikara paridhini kaligi untundi. Deeniki adanapu DGP leda IG sthayi adhikari director ga vyavharistaru. Prasthutam rashtramlo unna 32 vela kilometarla roadla network lo shastriya paddhatilo traffic nu nirvahinchadam ee samstha pradhana lakshyam.
Mukhyanga pattana pranthallo traffic niyantrana, enforcement pai ee bureau pratyeka drushti saristundi. Motor Vehicles Act-1988 prakaram traffic vidhula paryavekshanalato paatu, highway patrolling, road pramadala daryaptu vanti kelika amshalanu idi nirvahistundi.
Road bhadrata kosam electronic monitoring, adhunika analytics mariyu prosecution ku pratyeka vyavasthanu ee bureau ropendistundi. Kendra rahadari ravana shakha nirdeshinchina bhadrata niyamalanu kachitanga amalu cheyadam deeni badhyata. Ee pratyeka vyavastha dwara road pramadalanu ghanineeyanga tagginchi, prayanikulaku surakshitamaina prayananni andinchadam prabhutva lakshyam.
Rashtra road bhadrata mandali paryavekshanalo ee bureau panichestundi. Rashtramloni anni police commissionerate, jillala traffic vibhagala karyakalapala pai TG-TMARS nirantharam paryavekshana untundi.