చిన్న ఐటీ సంస్థలకు భారీ ప్రోత్సాహం.. హైదరాబాద్‌లో షేర్డ్ ఆఫీస్ సెంటర్లుChinna IT samsthalaku bhari protsaham.. Hyderabad lo shared office centers
తక్కువ వనరులు ఉన్న చిన్న ఐటీ సంస్థల కోసం హైదరాబాద్‌లో షేర్డ్ ఆఫీస్ సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు.Takkuva varusulu unna chinna IT samsthala kosam Hyderabad lo shared office center-lanu erpa chestunnattu IT shakha mantri Duddilla Sridharbabu vellidincharu.
తెలంగాణ రాష్ట్రంలో చిన్న మరియు మధ్యతరహా ఐటీ సంస్థలకు, ముఖ్యంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (GCC) కోసం ప్రత్యేక మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. పరిమిత వనరులతో కార్యకలాపాలు ప్రారంభించాలనుకునే 150 మందిలోపు ఉద్యోగులు ఉన్న సంస్థల కోసం 'షేర్డ్ ఆఫీస్ స్పేస్ సెంటర్'ను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ కేంద్రం ద్వారా చిన్న సంస్థలకు 'ప్లగ్ అండ్ ప్లే' సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని, దీనివల్ల కంపెనీలు తక్కువ సమయంలోనే కార్యకలాపాలు ప్రారంభించవచ్చని మంత్రి వివరించారు. అలాగే, కృత్రిమ మేధ (AI) రంగంలో శిక్షణ కోసం ప్రత్యేక ఏఐ స్కూల్, క్వాంటం కంప్యూటింగ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం అందించేందుకు త్వరలో ఒక ప్రత్యేక ఫండ్‌ను కార్యరూపం కార్డునట్లు మంత్రి తెలిపారు. లైఫ్ సైన్సెన్స్ రంగంలో తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి 'జీనోమ్ వ్యాలీ'లో '1 బయో'ను ప్రారంభించామని, ఇది బయోటెక్ స్టార్టప్‌లకు తక్కువ ఖర్చుతో అత్యాధునిక మౌలిక సదుపాయాలను అందిస్తుందని చెప్పారు.
నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడం కోసం స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించామని, అన్ని జిల్లా కేంద్రాల్లో స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఐటీఐలను అధునాతన సాంకేతిక కేంద్రాలుగా మార్చడం ద్వారా యువతకు విదేశాల్లో కూడా మంచి అవకాశాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
Telangana rashtramlo chinna mariyu madhyataraha IT samsthalaku, mukhyanga Global Capability Centers (GCC) kosam pratyeka maulika sadupayalu kalpinarunnattu IT, parishramala shakha mantri Duddilla Sridharbabu teliparu. Parimitha varusulato karyakalapalu prarambhinchalanukune 150 mandhilopu udyogulu unna samsthala kosam 'Shared Office Space Center' nu erpa chestamani ayana termukararu.
Ee kendram dwara chinna samsthalaku 'Plug and Play' soukaryalu anubadulo untayani, deenivalla companylu takkuva samayamlone karyakalapalu prarambhinchavacchani mantri vivarincharu. Alage, Kritrima Medha (AI) rangamlo shikshana kosam pratyeka AI School, Quantum Computing lo Center of Excellence nu erpa cheyunnattu ayana vellidincharu.
Startups-ku arthika sahayam andincheduku tvaralo oka pratyeka fund-nu karyarupam karudantla mantri teliparu. Life Sciences rangamlo Telangana nu prapancha sthayiki teesukelladaniki 'Genome Valley' lo '1 Bio' nu prarambhinchamani, idi Biotech startups-ku takkuva kharchuto athyadhunika maulika sadupayalanu andistundani chepparu.
Naipunyam kaligina manava varulanu tayaru cheyadam kosam Skills University ni prarambhinchamani, anni jilla kendarallo Skill Center-lanu erpa chestunnattu mantri teliparu. ITI-lanu adhunathana sankethika kendaluga marchadam dwara yuvathaku videshallo kuda manchi avakashalu labhinchela charyalu teesukuntunnattu ayana spashtam chesaru.