కారు డ్యాష్‌బోర్డ్‌లో వెర్చే వార్నింగ్ లైట్ల ప్రాముఖ్యత: వాహనదారుల కోసం కీలక సూచనలుCar dashboard lo verche warning lightla pramukhyatha: Vahanadarula kosam kelika suchanalu
కారు డ్యాష్‌బోర్డ్‌పై వెర్చే వివిధ రంగుల వార్నింగ్ లైట్లు వాహనంలో సాంకేతిక లోపాలను సూచిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే భారీ ఖర్చులు లేదా ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది.Car dashboard pai verche vividha rangula warning lightlu vahanamlo sankethika lopalanu suchistayi. Veetini nirlakshyam chesthe bhari kharchulu leda pramadalaku daritise avakasham undi.
ప్రస్తుత కాలంలో వాహనాలు ప్రయాణాల్లో కీలకమైనవి. అయితే, డ్రైవింగ్ సమయంలో డ్యాష్‌బోర్డ్‌పై వెర్చే వార్నింగ్ సింబల్స్‌ను చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ సింబల్స్ కారులో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తినప్పుడు ఇంజిన్ ఇచ్చే హెచ్చరికలు. వీటిని సకాలంలో గుర్తించి చర్యలు తీసుకోకపోతే కారు తీవ్రంగా పాడవ్వడమే కాకుండా, భారీ రిపేర్ ఖర్చులు భరించాల్సి వస్తుంది.
డ్యాష్‌బోర్డ్‌పై ఇంజిన్ ఆకారంలో 'చెక్ ఇంజిన్' లైట్ వెలిగితే, అది ఎలక్ట్రానిక్ లేదా మెకానికల్ సెన్సార్లలో సమస్య ఉందని సూచిస్తుంది. అలాగే, ఆయిల్ డ్రాప్ ఆకారంలో ఉండే 'ఆయిల్ ప్రెజర్' లైట్ వెలిగితే ఇంజిన్‌లో ఆయిల్ తక్కువగా ఉందని అర్థం. ఆయిల్ లేకుండా కారు నడిపితే ఇంజిన్ సీజ్ అయ్యే ప్రమాదం ఉంది, కాబట్టి వెంటనే ఆపి చెక్ చేయాలి.
కూలెంట్ టెంపరేచర్ లైట్ వెలిగితే ఇంజిన్ ఓవర్ హీట్ అవుతోందని అర్థం. బ్యాటరీ గుర్తుతో కూడిన లైట్ వెలిగితే ఛార్జింగ్ సిస్టమ్‌లో లోపం ఉన్నట్లు సూచిస్తుంది. బ్రేక్ సిస్టమ్ వార్నింగ్ లైట్ వెలిగితే హ్యాండ్ బ్రేక్ వేసి ఉన్నా లేదా బ్రేక్ ఆయిల్ తక్కువగా ఉన్నా అది కనిపిస్తుంది.
ముఖ్యంగా, డ్యాష్‌బోర్డ్‌పై పసుపు లేదా ఆరెంజ్ రంగులో లైట్లు వెలిగితే త్వరలో చెక్ చేయాలని అర్థం. ఒకవేళ ఎరుపు రంగులో లైట్ వెలిగితే, అది అత్యవసర హెచ్చరికగా భావించి వెంటనే కారును ఆపి సమస్యను పరిష్కరించాలి. చిన్న నిర్లక్ష్యాలు పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున వాహన భద్రతపై ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.
Prasthutha kalamlo vahanalu prayanallo kelikamainavi. Ayithe, driving samayalo dashboard pai verche warning symbols nu chalamandhi nirlakshyam chestuntaru. Ee symbols car lo edaina sankethika lopam taletinnappudu engine icche hechharikalu. Veetini sakalamlo gurtinchi charyalu teesukokapote car teevranga padavvadame kakunda, bhari repair kharchulu bharinchalsi vastundi.
Dashboard pai engine akaramlo 'Check Engine' light veligite, adi electronic leda mechanical sensorla samasya undani suchistundi. Alage, oil drop akaramlo unde 'Oil Pressure' light veligite engine lo oil thakkuvaga undi ani artham. Oil lekunda car nadipithe engine seize ayye pramadam undi, kabatti ventane aapi check cheyali.
Coolant temperature light veligite engine over heat avutondani artham. Battery gurtutho kudina light veligite charging system lo lopam unnattu suchistundi. Brake system warning light veligite hand brake vesi unna leda brake oil thakkuvaga unna adi kanipistundi.
Mukhyanga, dashboard pai pasupu leda orange rangulo lightlu veligite thvaralo check cheyali ani artham. Okavela erupu rangulo light veligite, adi athyavarsa hechharikaga bhavinchi ventane carnu aapi samasyanu parishkarinchali. Chinna nirlakshyalu pedda pramadalaku daritise avakasham unnanduna vahana bhadratha pai eppudu apramattanga undali.
ఈ వార్తలో తప్పు ఉందా? నివేదించండిEe varthalo tappu undaa? Nivedinchandi