పీఎఫ్ ఖాతాదారులకు ఊరట: ఇంటి అవసరాల కోసం విత్‌డ్రా నిబంధనల్లో మార్పుPF khatadarulaku urata: Inti avasarala kosam withdraw nibandhanallo marpu
ఇల్లు కొనడం, నిర్మాణం లేదా హోమ్ లోన్ కోసం పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకునే ప్రక్రియను సులభతరం చేస్తూ కేంద్రం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది.Illu kondam, nirmanama leda home loan kosam PF dabbunu withdraw chesukune prakriyanu sulabhartam chestu kendram kotta nibandhanalanu praveshapedindi.
ఉద్యోగుల రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కోసం అమలు చేసే ఈపీఎఫ్ (EPFO) నిబంధనల్లో కీలక మార్పులు తీసుకుంది. ముఖ్యంగా ఇల్లు కొనడం, నిర్మాణం లేదా హోమ్ లోన్ వంటి అవసరాల కోసం పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకునే ప్రక్రియను మరింత సులభతరం చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం, ఇంటి అవసరాల కోసం విత్‌డ్రా చేసుకోవాలనుకునే వారు కనీసం 12 నెలల పాటు ఈపీఎఫ్ సభ్యులుగా ఉండాలి. అయితే, తమ ఖాతాలో ఉన్న మొత్తం మొత్తాన్ని విత్‌డ్రా చేసే అవకాశం ఉండదు. నిబంధనల ప్రకారం ఖాతాలో కనీసం 25 శాతం నగదును తప్పనిసరిగా ఉంచాలి. అంటే సభ్యులు తమ మొత్తం పొదుపులో 75 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఒక ఉద్యోగి తన సర్వీస్ కాలంలో ఇల్లు లేదా ఫ్లాట్ కొనడం, స్థలం కొనుగోలు, కొత్త ఇల్లు నిర్మాణం లేదా హోమ్ లోన్ కోసం గరిష్టంగా ఐదు సార్లు విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గతంలో కేవలం ప్రాథమిక వేతనాన్ని (Basic Salary) పరిగణనలోకి తీసుకునేవారు, కానీ ఇప్పుడు సభ్యుని ఎలిజిబుల్ బ్యాలెన్స్‌కే ప్రాధాన్యత ఇస్తారు.
ఉదాహరణకు, ఒక ఉద్యోగి ఖాతాలో రూ.10 లక్షలు ఉంటే, అందులో 25 శాతం అంటే రూ.2.50 లక్షలు ఖాతాలోనే ఉండాలి. మిగిలిన రూ.7.50 లక్షలను అవసరాల కోసం విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, విత్‌డ్రా చేసుకునే మొత్తం అనేది నిర్దేశించిన నిబంధనల ప్రకారం మారుతూ ఉంటుంది.
Udyogula retirement taruvatha arthika bhadrata kosam amalu chese EPFO nibandhanallo kelika marpulu teesukundi. Mukhyanga illu kondam, nirmanama leda home loan vanti avasarala kosam PF dabbunu withdraw chesukune prakriyanu marinta sulabhartam chesindi.
Kotta nibandhanala prakaram, inti avasarala kosam withdraw chesukovalanukune varu kanisam 12 nelala paatu EPFO sabhyuluga undali. Ayithe, tama khatalo unna mottam mottanni withdraw chese avakasam undadu. Nibandhanala prakaram khatalo kanisam 25 shatam nagadunu thappanisariga unchali. Ante sabhyulu tama mottam podupulo 75 shatam matrame withdraw chesukovachhu.
Oka udyogi thana service kalamlo illu leda flat kondam, sthalam konugolu, kottha illu nirmanam leda home loan kosam garishtanga aidu sarla withdraw chesukovadaniki avakasam untundi. Gatamlo kevalam pradhamika vetananni (Basic Salary) parigananlolu teesukunevaru, kani ippudu sabhyuni eligible balance ke pradhanyata istaru.
Udaharanaku, oka udyogi khatalo Rs.10 lakshalu unte, andulo 25 shatam ante Rs.2.50 lakshalu khatalone undali. Migilina Rs.7.50 lakshalanu avasarala kosam withdraw chesukovachhu. Ayithe, withdraw chesukune mottam anedi nirdeshinchina nibandhanala prakaram maruthu untundi.
ఈ వార్తలో తప్పు ఉందా? నివేదించండిEe varthalo tappu undaa? Nivedinchandi
కామెంట్లుComments (0)
లాగిన్ అయ్యిLogin ayyi లైక్, కామెంట్ చేయండి.like, comment cheyandi.