హైదరాబాద్ గణేష్ నిమజ్జనం: భారీ భద్రతా ఏర్పాట్లతో పోలీసుల కఠిన నిఘాHyderabad Ganesh Nimjanam: Baria bhadratha erpatlatho polusula kathina nigha
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం మరియు శోభాయాత్రల సమయంలో భద్రత కోసం 20 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిఘా కోసం డ్రోన్లు, సీసీ కెమెరాలు మరియు కంట్రోల్ రూమ్‌లను సిద్ధం చేశారు.Hyderabad lo Ganesh Nimjanam mariyu shobhayatrala samayalo bhadratha kosam 20 vela mandi polusulatho bariya bandobustu erpa chesaru. Nigha kosam drones, CC cameralu mariyu control roomlanu siddham chesaru.
హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం మరియు శోభాయాత్రల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నగరవ్యాప్తంగా సుమారు 20 వేల మంది పోలీసు సిబ్బందిని రంగంలోకి దింపుతూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిఘా కోసం నగరంలో ఉన్న 10 వేల సీసీ కెమెరాలతో పాటు, విగ్రహాల లెక్కింపు కోసం 100 హైరైజ్ కెమెరాలను వినియోగించనున్నారు. శోభాయాత్ర మార్గాల్లో 24 డ్రోన్ల ద్వారా నిరంతరాయంగా పర్యవేక్షణ సాగుతుంది. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ప్రధాన ప్రాంతాల్లోని భద్రతను పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు.
నిమజ్జనం కోసం 8,142 మంది అదనపు సిబ్బందిని, 42 ప్లాటూన్లు, అలాగే ఆర్.ఏ.ఎఫ్ మరియు సి.ఆర్.పి.ఎఫ్ బలగాలను మోహరించారు. జలాశయాల వద్ద రక్షణ కోసం గజ ఈతగాళ్లు, సహాయక బోట్లు సిద్ధంగా ఉంచారు. మహిళల భద్రత కోసం 26 షీ-టీంలను మూడు షిఫ్టుల్లో ఏర్పాటు చేశారు.
శోభాయాత్రలో అధిక శబ్దం చేసే పరికరాలు, డిజెలు వాడటంపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. భక్తుల కోసం జలమండలి 40 లక్షల వాటర్ ప్యాకెట్లను సిద్ధం చేసింది. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కీలక కూడళ్ల వద్ద అదనపు సిబ్బందిని నియూతులు.
అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లు మరియు జనరేటర్లను సిద్ధంగా ఉంచారు. ప్రధాన ప్రాంతాల్లో ఐజీ, డిఐజీ స్థాయి అధికారులు భద్రతా ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు.
Hyderabad nagarallo Ganesh Nimjanam mariyu shobhayatrala sandharbhanga elanti avanchineya ghatanalu jaragakunda polusulu bariya bhadratha erpatlu theppararu. Nagaravyaptamga sumaru 20 vela mandi police sibbandini rangaloki dimputu patishta bandobustu erpa chesaru.
Nigha kosam nagarallo unna 10 vela CC cameralalatho paatu, vigharala lekkimpu kosam 100 high-rise cameralanu viniyoginchanaru. Shobhayatra margallo 24 dronla dwara nirantharayanga paryavekshana sagutundi. Banjara Hills lo Command Control Center nundi pradhana prantalloni bhadratanu paryavekshinchela erpatlu chesaru.
Nimjanam kosam 8,142 mandi adanapu sibbandini, 42 platoonlu, alage R.A.F mariyu C.R.P.F balagalanu moharincharu. Jalasayala vadda rakshana kosam gaja ethagallu, sahayaka botlu siddhanga uncharu. Mahilala bhadratha kosam 26 She-teams nu moodu shiftlallo erpa chesaru.
Shobhayatralo adhika shabdam chese parikaralu, DJlu vadatam pai nishedham vidhincharu. Nibandhanalu ullanghisthe kathina charyalu teesukuntamani polusulu hechharincharu. Bhakthula kosam Jalamandali 40 lakshala water packetlanu siddham chesindi. Traffic ibbandulu lekunda kelika koodarula vadda adanapu sibbandini niyuthu.
Athyavarsa paristhitilanu edurkovadaniki ambulances, fire engines mariyu generatorlanu siddhanga uncharu. Pradhana prantallo IG, DIG sthayi adhikarulu bhadratha erpatlanu pratyakshanga paryavekshistaru.