దేశంలో పసిడి రుణాల జోరు.. రెండేళ్లలో రూ. 5.52 లక్షల కోట్లకు ఎగబాకిDeshamlo pasidi runala joru.. rendella lo Ru. 5.52 lakshala kotlaku egabaki
ఆర్బీఐ సులభతర నిబంధనల కారణంగా దేశవ్యాప్తంగా బంగారంపై తీసుకునే రుణాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ పోర్ట్‌ఫోలియో అత్యధికంగా ఉంది.RBI sulabhatara nibandhanala karanamga deshavyaptamga bangaram pai teesukune runalu bhariga perigayi. Mukhyanga dakshina Bharathadeshamlo ee portfolio athyadhikamga undi.
దేశంలో బంగారంపై తీసుకునే రుణాలు (గోల్డ్ లోన్లు) గత రెండేళ్లలో అనూహ్యంగా పెరగడం గమనార్య్యే అంశం. 2024 జూలై నాటికి కేవలం రూ. 1.24 లక్షల కోట్లుగా ఉన్న పసిడి రుణాల విలువ, 2026 జూలై నాటికి ఏకంగా రూ. 5.52 లక్షల కోట్లకు చేరుకుంది. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాల కంటే తక్కువ రిస్క్ ఉన్న బంగారం రుణాల వైపే బ్యాంకులు ప్రస్తుతం మొగ్గు చూపుతున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ (RBI) తీసుకొచ్చిన సులభతర నిబంధనలు ఈ వృద్ధికి ప్రధాన కారణం. రూ. 2.5 లక్షల వరకు రుణం తీసుకునే వారికి, తాకట్టు పెట్టిన బంగారం విలువలో 85 శాతం వరకు రుణాన్ని ఇచ్చే వెసులుబాటును ఆర్బీఐ కల్పించింది. దీనివల్ల మధ్యతరగతి ప్రజలు, చిన్న వ్యాపారులు అత్యవసర అవసరాల కోసం సులభంగా రుణాలు పొందగలుగుతున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోలో దక్షిణ భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది. మొత్తం లోన్లలో 70 శాతం కంటే ఎక్కువ దక్షిణ రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయి. ఇందులో తమిళనాడు 30 శాతం, ఆంధ్రప్రదేశ్ 15.9 శాతం, కర్ణాటక 10.2 శాతం వాటాలతో ముందున్నాయి. అయితే, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కూడా ఈ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది.
బంగారం ధరలు నిరంతరం పెరుగుతుండటం వల్ల ప్రజలు తమ వద్ద ఉన్న ఆభరణాల ద్వారా ఎక్కువ మొత్తంలో రుణాలు పొందగలుగుతున్నారు. మొండి బకాయిలు (NPA) తక్కువగా ఉండటం వల్ల జాతీయ బ్యాంకులు కూడా ఈ రంగాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నాయి. పసిడిని సురక్షితమైన ఆస్తిగా భావించే ప్రజలు, తమ ఆర్థిక అవసరాల కోసం ఈ రుణాల వైపు మొగ్గు చూపుతున్నారు.
Deshamlo bangaram pai teesukune runalu (gold loans) gatha rendella lo anuhyanga peradam gamanaryye ansham. 2024 July natiki kevalam Ru. 1.24 lakshala kotluga unna pasidi runala viluva, 2026 July natiki ekanga Ru. 5.52 lakshala kotlaku cherukundi. Credit cardlu, vyaktigata runala kante takkuva risk unna bangaram runala vaipe banklu prastutam moggu chuputunnayi.
Reserve Bank (RBI) teesukochina sulabhatara nibandhanalu ee vruddhiki pradhana karanam. Ru. 2.5 lakshala varaku runam teesukune variki, takattu pettina bangaram viluvalo 85 shatam varaku runanni icche vesulubatunu RBI kalpinchindi. Deenivalla madhyatharagathi prjalu, chinna vyaparulu athyavarsa avasarala kosam sulabhamga runalu pondagalagutunnaru.
Prastutam deshavyaptamga unna gold loan portfolio lo dakshina Bharathadesham kelika patra poshistondi. Mottam lonlo 70 shatam kante ekkuva dakshina rastrallone jarugutunnayi. Indulo Tamil Nadu 30 shatam, Andhra Pradesh 15.9 shatam, Karnataka 10.2 shatam vatalato mundunnayi. Ayithe, Uttar Pradesh, Pashchima Bengal, Gujarat vanti rastrallo kuda ee trend veganga perugutondi.
Bangaram dharalu nirantaram perugutundatam valla prjalu tama vadda unna abharanala dwara ekkuva mottamlo runalu pondagalagutunnaru. Mondi bakayilu (NPA) takkuvaga undatam valla jatiya banklu kuda ee ranganni seriously teesukuntunnayi. Pasidini surakshitamaina astiga bhavinche prjalu, tama arthika avasarala kosam ee runala vaipu moggu chuputunnaru.