వంటనూనె ధరల తగ్గింపు: కేంద్రం కీలక నిర్ణయంVantunune dharala taggimpu: Kendram kelika nirnayam
దసరా, దీపావళి పండుగలను దృష్టిలో ఉంచుకుని వంటనూనె దిగుమతి సుంకాలలో కేంద్రం భారీ తగ్గింపులు ప్రకటించింది. దీనివల్ల మార్కెట్లో వంటనూనె ధరలు తగ్గే అవకాశం ఉంది.Dasara, Deepavali pandugalanu drustilo unchukuni vantunune digumathi sumkallalo kendram bhari taggimpulu praktinshindi. Deenivalla market lo vantunune dharalu tagge avakasam undi.
రాబోయే దసరా, దీపావళి పండుగాల సీజన్‌లో నిత్యావసరాల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావం వల్ల గత కొంతకాలంగా భారీగా పెరిగిన వంటనూనె ధరలను అదుపులోకి తీసుకురావడమే ఈ చర్య లక్ష్యం.
ముఖ్యంగా సన్‌ఫ్లవర్, పామాయిల్, సోయాబీన్ వంటి వంటనూనెలపై దిగుమతి సుంకాలలో (కస్టమ్స్ డ్యూటీ) గణనీయమైన మార్పులు చేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ఉన్న 10 శాతం ప్రాథమిక సుంకాన్ని పూర్తిగా తొలగించి సున్నాకు తగ్గించింది. అలాగే రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై పన్నును 32.5 శాతం నుండి 22.5 శాతానికి తగ్గించింది.
ముడి పామాయిల్ మరియు సోయాబీన్ నూనెలపై ఉన్న 10 శాతం సుంకాన్ని 5 శాతానికి తగ్గించడంతో పాటు, రిఫైన్డ్ పామాయిల్, సోయాబీన్ నూనెలపై ఉన్న 32.5 శాతం పన్నును 27.5 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయాల వల్ల వంటనూనె దిగుమతి వ్యయం తగ్గి, హోల్‌సేల్ మరియు రిటైల్ మార్కెట్లలో ధరలు తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ నిర్ణయం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు వెసులుబాటు లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. పండుగల సమయంలో ఇతర నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, వంటనూనె ధరలు తగ్గడం వల్ల సామాన్యులకు కొంత ఊరట లభిస్తుందని పేర్కొన్నారు.
Raboye Dasara, Deepavali pandugala season lo nityavasarala dharalanu niyantrinchenduku kendra prabhutvam kelika nirnayam teesukundi. Antarjatiya paristitulu, El Nino prabhavam valla gatha konthakalamga bhariga perigina vantunune dharulanu adupuloki teesukravadame ee charya lakshyam.
Mukhyanga Sunflower, Palm oil, Soybean vanti vantununelapai digumathi sumkallalo (Customs Duty) ghananeeyamaina marpulu chesindi kendra arthika mantritva shakha. Crude Sunflower oil pai unna 10 shatam pradhamika sumkanni purthiga tholaginchi sunnaku tagginchindi. Alage Refined Sunflower oil pai pannunu 32.5 shatam nundi 22.5 shatanki tagginchindi.
Mudi Palm oil mariyu Soybean nunelapai unna 10 shatam sumkanni 5 shatanki tagginchadamtho paatu, Refined Palm, Soybean nunelapai unna 32.5 shatam pannunu 27.5 shatanki tagginchindi. Ee nirnayala valla vantunune digumathi vyayam taggi, Wholesale mariyu Retail market lo dharalu tagge avakasam undani adhikarulu teliparu.
Ee nirnayam valla peda, madhyataragathi kutumbalaku vesulubatu labhistundani prabhutvam bhavistondi. Pandugala samayalo ithara nityavasarala dharalu perige avakasam unnappatiki, vantunune dharalu taggadam valla saamanyulaku kontha oorata labhistundani perkunnaru.
ఈ వార్తలో తప్పు ఉందా? నివేదించండిEe varthalo tappu undaa? Nivedinchandi
కామెంట్లుComments (0)
లాగిన్ అయ్యిLogin ayyi లైక్, కామెంట్ చేయండి.like, comment cheyandi.