ఊపిరితిత్తుల ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన: 'లంగ్ అవేర్‌నెస్ వీక్'Uupirithittula arogyampai vidyarthulaku avagahana: 'Lung Awareness Week'
కానూరులోని ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు ఊపిరితిత్తుల ఆరోగ్యం, వాయు కాలుష్యం వల్ల కలిగే ముప్పులపై అవగాహన కల్పించారు.Kanuruloni engineering kalashalalo vidyarthulaku uupirithittula arogyam, vayu kalushyam valla kalige muppulapai avagahana kalpincharu.
నవయుగానంలో పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు 'లంగ్ అవేర్‌నెస్ వీక్-2026' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లాలోని కానూరులో ఉన్న పీవీపీసిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో మణిపాల్ హాస్పిటల్స్ వైద్యులు లోకేశ్ గుత్తా విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. క్రమం తప్పకుండా వ్యాయామం, జాగింగ్, సైక్లింగ్ చేయడం ద్వారా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పొగతాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్ల వల్ల ఊపిరితిత్తులకు తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు.
దగ్గు రెండు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగినా లేదా దగ్గుతున్నప్పుడు రక్తం పడినా వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యులు సూచించారు. వాయు కాలుష్యం నుండి రక్షణ కోసం మాస్క్‌లు ధరించడం, బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని వివరించారు. అలాగే 50 ఏళ్లు పైబడిన తల్లిదండ్రులకు అవసరమైన వ్యాక్సిన్లు చేయించుకునేలా పిల్లలు వారిని ప్రోత్సహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కొండపల్లి శివాజీబాబు, మణిపాల్ హాస్పిటల్స్ మెడికల్ సర్వీసెస్ హెడ్ జేసన్ ఐజాక్ పాల్గొన్నారు. విద్యార్థుల కోసం క్విజ్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అవగాహన పొందారు.
Navyuganamlo perugutunna vayu kalushyam karanamga uupirithittula arogyampai avagahana kalpinchenduku 'Lung Awareness Week-2026' karyakramanni nirvahincharu. NTR jillaloni Kanuru lo unna PVP Siddharth Engineering kalashalalo ee karyakramam jarigindi.
Ee karyakramamlo Manipal Hospitals vaidyulu Lokesh Gutta vidyarthulaku palu suchanalu icharu. Kramam tappakunda vyayamam, jogging, cycling cheyadam dwara uupirithittulanu arogyanga unchukovacchani ayana perkonnaaru. Mukhyanga pogatagadam, madyam sevinchadam vanti alavatla valla uupirithittulaku teevra nashtam jarugutundani hecharincharu.
Daggu rendu varala kante ekkuva kalam konusagina leda daggutunnappudu raktham padina ventane vaidyulanu sampradalincharu. Vayu kalushyam nundi rakshana kosam masks dharinchadam, bayataku velletappudu jagruthalu teesukovadam avasaramani vivarincharu. Alage 50 ellu paibadina tallidandrulaku avaramaina vaccines cheyinchukukola pilalu varini protsahinchalani koraru.
Ee karyakramamlo kalasala Principal Kondapalli Sivajibabu, Manipal Hospitals Medical Services Head Jason Isaac palgoncharu. Vidyarthula kosam quiz potylanu nirvahinchi vijetalaku bahumathulu andajesaru. Ee karyakramamlo vidyarthulu, adhyapakulu pedda sankhyalo palgoni avagahana pondaru.
ఈ వార్తలో తప్పు ఉందా? నివేదించండిEe varthalo tappu undaa? Nivedinchandi
కామెంట్లుComments (0)
లాగిన్ అయ్యిLogin ayyi లైక్, కామెంట్ చేయండి.like, comment cheyandi.