యూట్యూబ్ షాపింగ్‌లో భారీ మార్పులు.. అమెజాన్, మిషో వంటి సంస్థలతో భాగస్వామ్యంYouTube shopping lo bhari marpulu.. Amazon, Meesho vanti samsthalatho bhagaswamyam
యూట్యూబ్ షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్‌లో అమెజాన్, మిషో, టాటా క్లిక్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను చేర్చుకుంటోంది. దీనివల్ల వీడియోలు చూస్తున్నప్పుడే నేరుగా వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది.YouTube shopping affiliate programme lo Amazon, Meesho, Tata Cliq vanti pramukha e-commerce platforms nu cherchukuntondi. Deenivalla videolu chustunnappude neruga vastuvulanu konugolu chese avakasam kalugutundi.
యూట్యూబ్ తన షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్‌ను విస్తరిస్తూ, అమెజాన్‌ను కొత్త రిటైల్ భాగస్వామిగా చేర్చుకుంది. త్వరలో AJIO, Meesho, Snapdeal, మరియు Tata CLiQ వంటి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను కూడా ఈ ప్రోగ్రామ్‌లో భాగస్వాములుగా చేర్చుకోనుంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, మైంత్ర వంటి సంస్థలు ఈ వ్యవస్థలో భాగంగా ఉన్నాయి.
ఈ కొత్త భాగస్వామ్యాల వల్ల యూట్యూబ్ ఒకే క్యాటలాగ్‌లో వివిధ ప్లాట్‌ఫారమ్‌ల ఉత్పత్తులను వినియోగదారులకు అందించగలదు. దీనివల్ల మొబైల్, డెస్క్‌టాప్ లేదా స్మార్ట్ టీవీలలో వీడియోలు చూస్తున్నప్పుడునే ఆ వస్తువులను గుర్తించి నేరుగా కొనుగోలు చేయడం సులభమవుతుంది. భారత్‌లో షాపింగ్‌కు సంబంధించిన కంటెంట్‌ను వెతకడం గత ఏడాదిలో 55 శాతం పెరిగింది.
యూట్యూబ్ షాపింగ్ ద్వారా క్రియేటర్లకు లభించే అఫిలియేట్ చెల్లింపులు కూడా గణనీయంగా పెరిగాయి. కేవలం వీడియోల వేదికగా మాత్రమే కాకుండా, క్రియేటర్లకు నేరుగా ఆదాయం వచ్చే ఒక వాణిజ్య వేదికగా యూట్యూబ్ తన పరిధిని విస్తరిస్తోంది. దీనికోసం 'Ask YouTube' అనే AI ఆధారిత ఫీచర్‌ను కూడా ప్రవేశపెడుతోంది. దీని ద్వారా వినియోగదారులు వస్తువుల వివరాలను వాయిస్ కమాండ్స్ ద్వారా తెలుసుకోవచ్చు.
అంతేకాకుండా, అంతర్జాతీయ క్రియేటర్ల కోసం 'డైనమిక్ ప్రొడక్ట్ ట్యాగింగ్' సౌకర్యాన్ని కూడా యూట్యూబ్ అందిస్తోంది. ఇది వీక్షకులు ఉన్న దేశాన్ని బట్టి ఆటోమేటిక్‌గా స్థానిక కరెన్సీకి అనుగుణంగా ప్రొడక్ట్ లింక్‌లను మారుస్తుంది. బ్రాండ్లు మరియు క్రియేటర్ల మధ్య భాగస్వామ్యాలను సులభతరం చేయడానికి జనరేటివ్ AI ఆధారిత టూల్స్‌ను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది.
YouTube tana shopping affiliate programme nu vistaristu, Amazon nu kotta retail bhagaswamiga cherchukundi. Twaralo AJIO, Meesho, Snapdeal, mariyu Tata CliQ vanti pramukha e-commerce platforms lu kuda ee programme lo bhagaswamuluga cherchukonumundi. Ippatide Flipkart, Myntra vanti samstalu ee vyavasthalo bhagamga unnayi.
Ee kotta bhagaswamyala valla YouTube oke catalog lo vividha platformla utpattulanu viniyogadarulaku andinchagaladu. Deenivalla mobile, desktop leda smart TV lalo videolu chustunnappudune aa vastuvulanu gurtinchi neruga konugolu cheyadam sulabhamavutundi. Bharat lo shopping ku sambandhinchina content nu vetukadam gatha edadi lo 55 shatam perigindi.
YouTube shopping dwara creator laku labhinche affiliate chellimpulu kuda ghananeeyanga perigayi. Kevalam videola vedikaga matrame kakunda, creator laku neruga adayam vacche oka vanijya vedikaga YouTube tana paridhini vistaristondi. Deekosam 'Ask YouTube' ane AI adharita feature nu kuda praveshapedutondi. Deeni dwara viniyogadarulu vastuvula vivaralanu voice commands dwara telusukovachhu.
Anthekakunda, antarjatiya creatorla kosam 'Dynamic Product Tagging' saukaryam kuda YouTube andistondi. Idi veekshakulu unna desanni batti automatically sthanika currency ki anugunanga product link lanu marustundi. Brands mariyu creatorla madhya bhagaswamyalanu sulabataram cheyadaniki Generative AI adharita tools nu kuda twaralo anubhutuloki teeskuranumundi.