ఆదిలాబాద్‌లో పోలీసుల మధ్య ఘర్షణ: ఆర్ఎస్ఐపై హత్యాయత్నం ఆరోపణAdilabad lo polusula madhya gharshana: RSI pai hatyayatnam aropana
ఆదిలాబాద్ జిల్లాలో ఒక పోలీస్ బెటాలియన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం హత్యాయత్నంగా వెలుగులోకి వచ్చింది. అవినీతి వెల్లడించినందుకు ప్రతికారంగా ఒక అధికారి మరొకరిపై దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి.Adilabad jillalo oka police battalion vadda jarigina road pramadam hatyayatnamga veluguloki vachindi. Avineethi velladinchinanduku pratikaranga oka adhikari marokaru pai dadi chesarani aropanalu vachayi.
ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలం యాపల్ గూడ పోలీస్ బెటాలియన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఇప్పుడు తీవ్రంగా మారింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఆర్ఎస్ఐ రాకేష్పై, అదే బెటాలియన్‌లో పని చేస్తున్న ఆర్ఐ నరేష్ హత్యాయత్నం చేశారనే ఆరోపణలు వెలువడ్డాయి.
ఆర్ఎస్ఐ రాకేష్ తన డ్యూటీ ముగించుకుని తిరిగి బెటాలియన్‌కు వస్తుండగా, ఆర్ఐ నరేష్ వాహనంతో రాకేష్ బైక్‌ను ఢీకొట్టాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. బెటాలియన్‌లో జరుగుతున్న అవినీతి కార్యకలాపాలను రాకేష్ బయటపెడుతున్నారని, ఆ కారణంగా ఈ దాడి చేశారని వారు ఆరోపిస్తున్నారు.
ఇటీవలే బెటాలియన్‌లో జరిగిన అవకతవాలపై ఉన్నతాధికారులకు ఒక లేఖ అందజేయగా, ఆ వివరాలను రాకేష్ బయటకు లీక్ చేశారని నరేష్ భావించారని సమాచారం. ఈ కుట్రలో భాగంగానే ప్రమాదం జరిగినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
తీవ్రంగా గాయపడిన రాకేష్‌ను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, అనుమానితుడైన ఆర్ఐ నరేష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు.
Adilabad jilla rural mandalam Yapal Guda police battalion vadda jarigina road pradamam ippudu teevranga marindi. Ee pramadhamlo gayapadina RSI Rakesh pai, ade battalion lo pani chestunna RI Naresh hatyayatnam chesarane aropanalu veluvaddayi.
RSI Rakesh tana duty muginchukuni tirigi battalion ku vastundaga, RI Naresh vahanamto Rakesh bike nu dheekottadani kutumba sabhyulu merkonnaru. Battalion lo jarugutunna avineethi karyakalapalanu Rakesh bayatapedutunnaru ani, aa karanamga ee dadi chesaru ani varu aropistunnaru.
Iterivale battalion lo jarigina avakatavapai untadhikarulaku oka lekha andajeyaga, aa vivaralanu Rakesh bayataku leak chesarani Naresh bhavincharani samacharam. Ee kutralo bhagamgane pradamam jariginatla aropanalu vyaktamayayi.
Teevranga gayapadina Rakesh nu Adilabad RIMS asupatrikiki taralincharu. Badhitudi phiryadu hadhara ranga loki digina poluslu, anumanitudaina RI Naresh nu adupuloki teesukuni vicharana chepadutunnaru.
ఈ వార్తలో తప్పు ఉందా? నివేదించండిEe varthalo tappu undaa? Nivedinchandi