ఎంబీబీఎస్ ప్రవేశాల్లో ప్రతిభావంతులకు అన్యాయం.. విద్యార్థుల ఆశలపై నీళ్లుడుగుతున్నాన్న ఆరోపణMBBS praveshallo pratibhavantulaku anyayam.. vidyarthula ashalpai neelludugutunnanna aropana
ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త జీవో వల్ల మెరిట్ ఆధారిత ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు నష్టపోతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.Prabhutvam praveshapedina kotta GO valla merit adharita MBBS seatla ketayimpulo SC, ST, BC vidyarthulu nashtapotunnaru ani aropanalu velluvetthutunnayi.
రాష్ట్రంలో ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ-102 నిర్ణయం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు నష్టపోతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అమలులో ఉన్న పారదర్శకమైన విధానాలను మార్చడం ద్వారా, మెరిట్ ఆధారిత సీట్లను కేటాయించడంలో ప్రభుత్వమే అడ్డంకి సృష్టిస్తుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో జీఓ-151 ప్రకారం, విద్యార్థులు అన్ని వైద్య కళాశాలలను ఆప్షన్లుగా ఎంచుకోవాల్సి వచ్చేది. దీనివల్ల అత్యుత్తమ ర్యాంకులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఓపెన్ కేటగిరీలో సీట్లు పొంది, తర్వాతి దశలో తమ రిజర్వేషన్ కేటగిరీల ప్రకారం మెరుగైన కళాశాలల్లో సీట్లు పొందే అవకాశం ఉండేది. అయితే, ప్రస్తుత జీఓ-102 ద్వారా ఈ నిబంధనను తొలగించడం వల్ల విద్యార్థులు కేవలం తమకు నచ్చిన కొన్ని కళాశాలలను మాత్రమే ఎంచుకుంటున్నారని, దీనివల్ల ఓపెన్ కేటగిరీ సీట్లు కోల్పోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ మార్పు కారణంగా సుమారు 70 మంది ప్రతిభావంతులైన విద్యార్థులు తమకు దక్కాల్సిన ఓపెన్ కేటగిరీ సీట్లను కోల్పోయి, రిజర్వేషన్ కేటగిరీలకే పరిమితమయ్యారని సమాచారం. ఉదాహరణకు, గుంటూరు మెడికల్ కాలేజీలో తక్కువ ర్యాంకులు ఉన్న విద్యార్థులు రిజర్వేషన్ల ద్వారా సీట్లు పొందుతుండగా, మెరుగైన ర్యాంకులు ఉన్న విద్యార్థులు ఓపెన్ కేటగిరీలో సీట్లు పొందలేకపోయినట్లు గణాంకాలు వెల్లడయిస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల వెనుకబడిన వర్గాల విద్యార్థుల అవకాశాలు తగ్గిపోయాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Rashtramlo MBBS praveshala kosam prabhutvam teesukovachina GO-102 nirnayam valla pratibhavantulaina vidyarthulu nashtopotunnaru ani aropanalu vyakthamavutunnayi. Gatamlo amalulo unna paradarshamaina vidhanalanu marchadam dwara, merit adharita seatlanu ketayinchadamlo prabhutuvame addanki srustistundani vidyarthulu, tallidandrulu andolana vyaktham chestunnaru.
Gatamlo GO-151 prakaram, vidyarthulu anni vaidya kalashalalanu optionluga enchukovalsi vachedi. Deenivalla atyuttama ranklu sadhinchina SC, ST, BC, minority vidyarthulu open category lo seatlu pondi, taravati dashalo tama reservation categoryla prakaram merugaina kalashalallo seatlu pondhe avakasam undedi. Ayithe, prastuta GO-102 dwara ee nibandhananu tolakinchadam valla vidyarthulu kevalam tamaku nachina konni kalashalalanu matrame enchukuntunnaru, deenivalla open category seatlu kolpotunnaru ani aropanalu vastunnayi.
Ee marpu karanamga sumaru 70 mandi pratibhavantulaina vidyarthulu tamuku dakkalsina open category seatlanu kolposi, reservation categorylake parimitamayyaru samacharam. Udaharanaku, Guntur Medical College lo takkuva ranklu unna vidyarthulu reservationla dwara seatlu pondutundaga, merugaina ranklu unna vidyarthulu open category lo seatlu pondalekapoyinattu ganankalu velladiyistunnayi. Ee nirnayam valla venkabadina vargala vidyarthula avakashalu tagipoyayani vimarshalu velluvetthutunnayi.